అనకాపల్లిలో రూ.22 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం

రిపోర్టర్: గోపి స్థలం: అనకాపల్లి

అనకాపల్లిలో రూ. 22 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్‌ను కేంద్రమంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంగా ప్రారంభించారు. పేదలకు మెరుగైన ఆధునిక వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని నాయకులు పేర్కొన్నారు.