జాతీయ స్థాయి సీఎస్ఆర్ పురస్కారాన్ని దక్కించుకున్న వియాష్ సైంటిఫిక్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కర్ణాటక
ఫార్మా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన వియాష్ సైంటిఫిక్ లిమిటెడ్ సంస్థ జాతీయ సీఎస్ఆర్ లీడర్షిప్ పురస్కారాన్ని దక్కించుకుంది. ఆరోగ్య సంరక్షణ, సామాజికాభివృద్ధి రంగాలలో చేసిన సేవలకు గాను బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. సంస్థ వైస్ ప్రెసిడెంట్ శరత్ కోనేరు, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ ఈ అవార్డును అందుకున్నారు. సమాజానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చడమే తమ లక్ష్యమని సంస్థ స్పష్టం చేసింది.