స్టార్‌లింక్ సేవలతో భద్రతా ముప్పు: ఎలన్ మస్క్ వ్యాఖ్యలను ఖండించిన స్వదేశీ జాగరణ్ మంచ్
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
భారత్‌లో స్టార్‌లింక్ ప్రవేశంతో జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ కో-కన్వీనర్ అశ్వనీ మహాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎలన్ మస్క్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఆయన కంపెనీ లైసెన్సును పూర్తిగా తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడకుండా, ప్రెషర్ పద్ధతులు అవలంబిస్తున్న స్టార్‌లింక్ టెక్నాలజీపై పలు దేశాల్లో అనుమానాలున్నాయని, భారత్ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.