పదిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినికి ల్యాప్‌టాప్ బహుకరించిన పవన్
రిపోర్టర్: హరి
స్థలం: కాకినాడ
పదివ తరగతి పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచి 596 మార్కులు సాధించిన కాకినాడ జిల్లా సంపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని డి. చిన్నారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆమెకు ల్యాప్‌టాప్‌ను బహుకరించి భవిష్యత్తులో మరింత ఉన్నత విద్యను అభ్యసించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించినట్లు జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది.