మహాత్మా గాంధీగా నటిస్తున్న ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్
రిపోర్టర్: నరేష్
స్థలం: భారతదేశం
ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ జాతిపిత మహాత్మా గాంధీ పాత్రలో నటిస్తున్నారు. సుధీర్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. గాంధీజీ గెటప్‌లో మనోజ్ బాజ్‌పాయ్ రూపురేఖలు, ముఖకవళికలతో అచ్చుగుద్దినట్లు ఒదిగిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్వాతంత్ర్య పోరాట చరిత్రలోని ఒక కీలకమైన 21 రోజుల చారిత్రాత్మక అధ్యాయం ఆధారంగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.