సోషల్ మీడియాలో ఐశ్వర్యరాయ్తో పాటు తనకు తీవ్ర వ్యతిరేకత: ఏక్తా కపూర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ముంబై

సోషల్ మీడియా తొలి రోజుల్లో తనపై తీవ్రమైన ద్వేషం వ్యక్తమైందని ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ వెల్లడించారు. ఆర్కుట్ వేదికగా తనతో పాటు అగ్రనటి ఐశ్వర్యరాయ్పై అత్యధిక ఫాలోవర్లతో హేట్ గ్రూపులు ఉన్నట్లు గుర్తించానని ఆమె తెలిపారు. నుదిటిపై తిలకం ధరించడం, సంప్రదాయాలను పాటించడం వల్ల తాను తీవ్ర ఎద్దేవాను ఎదుర్కొన్నానని, హిందూ సంస్కృతిపై వివక్ష కొనసాగుతోందని ఓ ఇంటర్వ్యూలో ఏక్తా కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు.