యూఏఈ పర్యటనలో వందలాది పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి భేటీ

రిపోర్టర్: వెంకట్ స్థలం: Bhubaneswar

ఒడిశా ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇటీవల యూఏఈలో పర్యటించి ఒడిశా ఇన్వెస్టర్ మీట్ 2026లో పాల్గొన్నట్లు రాష్ట్ర మంత్రి సంపద్ చంద్ర స్వైన్ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సుమారు 160 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలపై చర్చించారని ఆయన మీడియాకు వెల్లడించారు.