వైసీపీలో షాక్: మోపిదేవి శ్రీనివాసరావు సస్పెండ్!

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఆంధ్రప్రదేశ్

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన మోపిదేవి శ్రీనివాసరావును సస్పెండ్ చేశారు. ఐదు నెలల క్రితమే కాంగ్రెస్ నుండి వైసీపీలో చేరిన శ్రీనివాసరావు, రేపల్లె నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు, ఎమ్మెల్యే టికెట్ ప్రచారం చేస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నుండి పలువురు నేతలు వెళ్లిపోతుండగా, ఈ సస్పెన్షన్ జిల్లాలో చర్చనీయాంశమైంది.