లండన్ లో వేలంలో రోజర్ ఫెదరర్ వింబుల్డన్ జ్ఞాపకాలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: లండన్
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ 2007 వింబుల్డన్ ఫైనల్ లో రాఫెల్ నాదల్ తో తలపడిన సమయంలో ధరించిన దుస్తులు, ఉపయోగించిన రాకెట్ లండన్ లోని క్రిస్టీస్ లో జరిగిన వేలంలో 1,87,500 పౌండ్లకు అమ్ముడయ్యాయి. ఫెదరర్ ఐదో సారి వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్న ఈ చారిత్రక మ్యాచ్ కు సంబంధించిన వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రోజర్ ఫెదరర్ ఫౌండేషన్ కు నిధులు సమకూర్చేందుకు చేపట్టిన స్వచ్ఛంద వేలంలో ఈ విక్రయం జరిగింది.