ఉత్తరప్రదేశ్ స్పెషల్ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం
రిపోర్టర్: నరేష్
స్థలం: ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్ విద్యా సేవా ఎంపిక కమిషన్ స్పెషల్ టెట్ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 5 నుండి అక్టోబర్ 4 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 3న పరీక్ష జరగనుంది. 150 మార్కులకు జరిగే ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ లేదు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది. ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు ఇది కీలకం.