ట్రంప్ ఆర్థిక బెదిరింపులు: మోడీ లొంగొద్దు - నారాయణ

రిపోర్టర్: వెంకట్ స్థలం: India

సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఆర్థిక టారిఫ్‌లు పెంచేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చౌక చమురు కొనుగోలుకు భారత్ ప్రయత్నిస్తే ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తామని ట్రంప్ బెదిరిస్తున్నారని, ఈ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు ప్రధాని మోడీ లొంగకూడదని నారాయణ డిమాండ్ చేశారు. భారత్ తన విధానానికే కట్టుబడి దృఢంగా నిలబడాలని, బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని సూచించారు.