ఆటోమొబైల్ మార్కెట్లోకి కొత్త బైక్: కవాసకి జెడ్ 650 ఎస్ విడుదల
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ ప్రీమియం మోటార్ సైకిల్ తయారీ సంస్థ కవాసకి భారత మార్కెట్లోకి సరికొత్త జెడ్ 650 ఎస్ వేరియంట్ ను విడుదల చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ నూతన మోడల్ ఎక్స్ షో రూమ్ ధరను ఏడు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలుగా నిర్ణయించినట్లు వెల్లడించారు. సరికొత్త డిజైన్, ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు, ఆధునిక ఫీచర్లతో ఈ బైక్ ను తీసుకొచ్చామని పేర్కొన్నారు.