పసిడి ప్రియులకు షాక్: మళ్లీ పెరిగిన బంగారం ధరలు

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావంతో పసిడి ధరలు మళ్లీ పెరిగాయని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. సెప్టెంబర్ నెలలో భారీగా పతనమైన గోల్డ్ రేట్లు, అక్టోబర్ రెండు శుక్రవారం నాడు పెరగడం కొనుగోలుదారులలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రతి కేటగిరీ బంగారం ధరల్లోనూ పెరుగుదల నమోదైనట్లు మార్కెట్ వర్గాలు స్పష్టం చేశాయి.