రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు రూ.629 కోట్ల ట్రూడౌన్ ఉపశమనం

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి భారీ ఊరట కల్పించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.629 కోట్లను ట్రూడౌన్ చేసేందుకు అనుమతినిస్తూ ఏపీఈఆర్సీ కీలక ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. గతంలో అంచనా వేసిన వ్యయం కంటే తక్కువ ఖర్చు కావడం వల్ల ఏర్పడిన ఈ మిగులు మొత్తాన్ని భవిష్యత్తులో కరెంట్ బిల్లుల్లో సర్దుబాటు చేయాలని డిస్కంలను మండలి స్పష్టంగా ఆదేశించింది.