అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు తత్వం సినిమా
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
దినేష్‌తేజ్, దష్విక జంటగా అర్జున్ కోలా దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం తత్వం అక్టోబర్ రెండున థియేటర్లలో విడుదల కానుంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మన చుట్టూ జరిగే సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలోని ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, చేతన్ భరద్వాజ్ అందించిన సంగీతం అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.