రాప్తాడులో దారుణం: విద్యార్థిని గోపికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్ లో పదో తరగతి విద్యార్థిని గోపికపై ఉన్మాది హేమంత్ ఎలక్ట్రిక్ రంపంతో పాశవికంగా దాడి చేశాడని పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను గ్రీన్ ఛానెల్ ద్వారా బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ ఘోర ఘటనపై స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.