వైద్య విద్యార్థినికి 'రిసర్చర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు
రిపోర్టర్: వెంకట్
స్థలం: Rajasthan
రాజస్థాన్లోని కోటా ప్రభుత్వ వైద్య కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థిని డాక్టర్ కోమల్ వర్మ సలుజాకు అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ 'రిసర్చర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2026'ను బహుకరించింది. ఈ పురస్కారాన్ని అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలైన తొలి వైద్య విద్యార్థినిగా ఆమె రికార్డు సృష్టించారు. గ్లోబల్ హెల్త్ సమస్యలపై ఆమె చేసిన పరిశోధనలకు ఈ గౌరవం దక్కింది.