కిరాణం దుకాణంలో ఫ్రిడ్జ్ పేలి మంటలు చెలరేగిన వైనం

రిపోర్టర్: సునీల్ స్థలం: శివంపేట

శివంపేట మండల కేంద్రంలోని కంటాల హనుమంతు గుప్తా కిరాణం దుకాణంలో అకస్మాత్తుగా ఫ్రిడ్జ్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్ర శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అకస్మాత్తు ప్రమాద ఘటనపై పోలీసులు మరియు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతూ పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.