ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఆయుధాల డంప్ భగ్నం చేసిన బలగాలు

రిపోర్టర్: నరేష్ స్థలం: ఛత్తీస్‌గఢ్

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా బేద్రే పోలీస్ స్టేషన్ పరిధిలోని లంకా పహాడి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల రహస్య ఆయుధాల డంప్‌ను భగ్నం చేశాయి. మైన్ల తొలగింపు ఆపరేషన్‌లో భాగంగా భూగర్భంలో దాచిన భారీ మొత్తంలో ఎస్‌ఎల్‌ఆర్, ఇన్సాస్ రైఫిల్స్, బీజీఎల్ లాంచర్లు, చైనీస్ హ్యాండ్ గ్రెనేడ్‌లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.