స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమిదే ఘనవిజయమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ధీమా

రిపోర్టర్: అశోక్ స్థలం: విజయనగరం

గత అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ధీమా వ్యక్తం చేశారు. విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మూడు పార్టీల సమష్టి అభివృద్ధిని ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ అరాచక పాలనకు చరమగీతం పాడేలా కూటమి నేతలు సమన్వయంతో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని స్పష్టం చేశారు.