చిత్తూరు పే అండ్ అకౌంట్స్ కార్యాలయంలో వేధింపులంటూ కాంట్రాక్టర్ల ఆవేదన

రిపోర్టర్: శివ స్థలం: చిత్తూరు

చిత్తూరులోని అసిస్టెంట్ పే అండ్ అకౌంట్స్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని గుత్తేదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల నమోదు కోసం అధికారులు భారీగా కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. పర్సెంటేజీలు ఇస్తేనే ఫైళ్లు కదులుతున్నాయని, లేనిప బిల్లులను నిలిపివేస్తున్నారని వారు తెలిపారు. అయితే తమ కార్యాలయంలో అక్రమ వసూళ్లకు తావులేదని, ఎప్పటికప్పుడు బిల్లులు ఆన్లైన్ చేస్తున్నామని అసిస్టెంట్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ నరసింహులు స్పష్టం చేశారు.