అనాథ పిల్లల కోసం ప్రత్యేక గ్రామం నిర్మించిన హాలీవుడ్ నటుడు క్రిస్ బేల్

రిపోర్టర్: శివ స్థలం: పాల్మ్‌డేల్

ఫోస్టర్ కేర్ వ్యవస్థలో అనాథ పిల్లలు పడుతున్న వేదనను తొలగించేందుకు ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ బేల్ కీలక నిర్ణయం తీసుకున్నారని సీనియర్ జర్నలిస్టు తెలిపారు. కాలిఫోర్నియాలోని పాల్మ్డేల్లో తోటి పిల్లలు, అన్నాచెల్లెళ్లు విడిపోకుండా కలిసి ఉండేలా ఒక ప్రత్యేక గ్రామాన్ని నిర్మించినట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా అనాథ పిల్లలకు కుటుంబ వాతావరణాన్ని కల్పించి, వారిలో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు నిపుణులైన సంరక్షకులతో సేవలు అందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.