డిపాజిట్ డబ్బులు ఇవ్వని సహకార బ్యాంకుకు భారీ జరిమానా
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కేరళ
కేరళలో మెచ్యూరిటీ తీరిన ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులను డెపాజిటర్ విత్ డ్రా చేసుకోకుండా నిరాకరించిన కండల సహకార సంఘం కోఆపరేటివ్ బ్యాంకుకు జిల్లా వినియోగదారుల కమిషన్ గట్టి షాకిచ్చింది. బాధితురాలికి రూ. 13.87 లక్షలు చెల్లించాలని, రూ. 25,000 నష్టపరిహారం, రూ. 3,000 కోర్టు ఖర్చులు ఇవ్వాలని ఆదేశిస్తూ సెప్టెంబర్ 17, 2026న కీలక తీర్పు వెలువరించింది.