ఒడిశాలో ముగిసిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Odisha

ఒడిశాలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎస్ గోపాలన్ తెలిపారు. సోమవారం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు వెల్లడించారు. సమగ్ర పరిశీలన అనంతరం వివిధ కారణాలరీత్యా మొత్తం 20.56 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు స్పష్టం చేశారు. కొత్తగా దాఖలైన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి పేర్లను చేర్చడంతో తుది జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,16,32,754 కు చేరినట్లు వివరించారు.