నీట్ ఎస్ఎస్ కట్ ఆఫ్ పర్సంటైల్ ముప్పై శాతానికి తగ్గింపు
రిపోర్టర్: నరేష్
స్థలం: న్యూఢిల్లీ
దేశంలో భారీగా మిగిలిపోయిన సూపర్ స్పెషాలిటీ సీట్లను భర్తీ చేసేందుకు నీట్ ఎస్ఎస్ అర్హత పర్సంటైల్ ను కేంద్ర ప్రభుత్వం యాభై శాతం నుండి ముప్పై శాతానికి తగ్గించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా మరో ఆరు వేల మంది అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియకు అర్హత సాధించనున్నారు.