టెక్ రంగంలో నలభై ఏళ్ల ఉద్యోగులను వెంటాడుతున్న లేఆఫ్ల భయం

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

సాఫ్ట్వేర్ రంగంలో నలభై ఏళ్లు దాటిన ఉద్యోగులపై లేఆఫ్ల కత్తి వేలాడుతోంది. ఏఐ, ఆటోమేషన్ సాంకేతికతల రాకతో ఒరాకిల్, అడిడాస్ వంటి దిగ్గజ సంస్థలు భారీగా ఉద్యోగాల కోత విధిస్తున్నాయి. ముఖ్యంగా అధిక వేతనాలు, సీనియారిటీ కలిగిన వారిని తొలగించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, లేని పక్షంలో ఉద్యోగ భద్రత కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.