రూపాయిల కోట్ల అల్యూమినియం ఫ్యాక్టరీ భూముల క్రమబద్ధీకరణ ఫైల్ నిలిపివేత

రిపోర్టర్: సునీల్ స్థలం: Hyderabad

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి పరిధిలోని సుమారు పది వేల కోట్ల రూపాయల విలువైన అల్యూమినియం ఫ్యాక్టరీ భూముల క్రమబద్ధీకరణ ఫైల్‌ను పరిశ్రమల శాఖ తాత్కాలికంగా పక్కనపెట్టింది. నిబంధనలను ఉల్లంఘించి రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిన వైనంపై మీడియాలో కథనాలు రావడంతో, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించి ఈ ఫైల్‌ను అబేయన్స్‌లో ఉంచాలని అధికారులను ఆదేశించారు.