ఈడీ ఉచ్చులో వివేకా హత్య కేసు: విచారణకు హాజరైన శివశంకర్‌రెడ్డి
రిపోర్టర్: సునీల్
స్థలం: Hyderabad
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముమ్మరం చేశారని సీనియర్ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో ఏ-5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. హత్య కోసం నలభై కోట్ల రూపాయల ఒప్పందం జరిగిందన్న కోణంలో మనీలాండరింగ్ కోణంలో అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఎంపీ అవినాష్‌రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.