పెట్రోల్ బంకుల్లో యూపీఐ లావాదేవీల ఎండీఆర్ ఛార్జీల మినహాయింపునకు కేంద్రం పరిశీలన
రిపోర్టర్: అశోక్
స్థలం: న్యూఢిల్లీ
యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీల విధింపుపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పెట్రోల్ బంకుల్లో జరిగే డిజిటల్ చెల్లింపులపై విధిస్తున్న ఎండీఆర్ ఛార్జీల ఉపసంహరణను పరిశీలిస్తున్నట్లు సమాచారం. రూ.2,000 కంటే ఎక్కువ చెల్లింపులపై డీలర్లు లావాదేవీకి రూ.5 చొప్పున చెల్లించాలన్న నిబంధనపై ఆల్ ఇండియా పెట్రోలియమ్ డీలర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.