వరద ముంపులో చిక్కుకున్న డెబ్బై మందిని రక్షించిన విశాఖ నగర పోలీసులు

రిపోర్టర్: నరేష్ స్థలం: Visakhapatnam

అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో విశాఖపట్నంలోని కొమ్మాది హౌసింగ్ బోర్డు కాలనీలో వరద నీటిలో చిక్కుకున్న 70 మందిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదు అంతస్తుల భవనంలో భారీగా వరద చేరినట్లు అర్ధరాత్రి కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి నగర పోలీసులు అర్ధరాత్రి చేపట్టిన ఈ సాహసోపేత సహాయక చర్యల ద్వారా ప్రాణాపాయం తప్పింది.