తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల ఆన్లైన్ ప్రచారాలపై టీటీడీ స్పష్టత
రిపోర్టర్: విజయ్
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆన్లైన్ బుకింగ్‌పై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను టీటీడీ తీవ్రంగా ఖండించింది. ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా పనిచేస్తోందని, భక్తులు ఎలాంటి అపోహలను నమ్మవద్దని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. దర్శన టికెట్ల కోసం సాధారణ కోటా కంటే సుమారు తొమ్మిది రెట్లు అధికంగా డిమాండ్ ఉందని, రద్దీని నియంత్రించేందుకు వర్చువల్ క్యూ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.