మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈజ్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టిపై ఈడీ ఛార్జ్ షీట్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: New Delhi
మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈజ్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అక్రమ బెట్టింగ్ సొమ్మును విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ముసుగులో ఈక్విటీ మార్కెట్లోకి మళ్లించడంలో ఆయన సహకరించినట్లు ఆరోపించింది. రాయ్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టులో ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేయగా, పియోఎమ్ఎల్ఏ చట్టం కింద ఆయనకు చెందిన రూ. 59.60 కోట్ల విలువైన డీమ్యాట్ షేర్లను ఈడీ అటాచ్ చేసింది.