బేగంపేటలో అక్రమ బెల్ట్ షాపుల నిర్వాహకులకు హెచ్చరికలు జారీచేసిన సర్పంచ్

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామంలో మద్యం అమ్మకాలను అరికట్టాలని సర్పంచ్ ఇండ్ల అనుష సుమన్ నిర్ణయించారు. పాలకవర్గ తీర్మానం మేరకు బెల్ట్ షాపుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. గ్రామంలో సిట్టింగ్ లు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. దీనివల్ల కుటుంబ తగాదాలు తగ్గి ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని సర్పంచ్ పేర్కొన్నారు.