టెన్త్ పరీక్ష ఫీజుల చెల్లింపుల్ లో సర్వర్ సమస్య: తీవ్ర ఇబ్బందుల్ లో ప్రధానోపాధ్యాయులు
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో మార్చి 2027లో నిర్వహించనున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్ లో తీవ్రమైన సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులను ప్రభుత్వ ఖాతాకు జమ చేయడానికి ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సర్వర్ డౌన్ కావడంతో ప్రక్రియ నిలిచిపోయిందని వారు పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు గడువు ఉండటంతో త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.