ఓటీటీలోకి శ్రీవిష్ణు కామెడీ సినిమా: అమెజాన్ ప్రైమ్లో కామ్రేడ్ కల్యాణ్ స్ట్రీమింగ్

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన తాజా కామెడీ ఎంటర్టైనర్ కామ్రేడ్ కల్యాణ్ సినిమా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా శుక్రవారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ మరియు మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉందని తెలిపారు.