'వైసీపీ నాయకులు ఫస్ట్ గ్రేడ్ క్రిమినల్స్': నారా లోకేష్ ఫైర్

రిపోర్టర్: కృష్ణ స్థలం: నెల్లూరు జిల్లా

నెల్లూరు జిల్లా కోవూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ వైఎస్సార్సీపీ నాయకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు ఫస్ట్ గ్రేడ్ క్రిమినల్స్ అని, రాజకీయ ముసుగులో కుల, మత విభేదాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి గొడ్డలి పార్టీ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.