హైవేపై బీభత్సం: బండ్లగూడ చౌరస్తాలో నిత్యం స్తంభిస్తున్న వాహనాల రాకపోకలు

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

బండ్లగూడ చౌరస్తా వద్ద తీవ్ర ట్రాఫిక్ జామ్ సమస్యతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు వాపోయారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఉదయం వేళల్లో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు సమయానికి చేరలేకపోతున్నారని స్థానికులు తెలిపారు. రాంగ్ రూట్ ప్రయాణాలు, రోడ్డు పనుల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.