ఐఐఎం రోతక్ వేదికగా మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్: భవిష్యత్ వ్యాపార వ్యూహాలపై చర్చ
రిపోర్టర్: కిరణ్
స్థలం: Rohtak
దేశంలోని ప్రముఖ మేనేజ్మెంట్ సంస్థలలో ఒకటైన ఐఐఎం రోతక్ ఆధ్వర్యంలో 2026 మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ ఘనంగా నిర్వహించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ ధీరజ్ శర్మ వెల్లడించారు. ఈ సదస్సులో యాభై మందికి పైగా పరిశ్రమల అధిపతులు, నిపుణులు పాల్గొని మారుతున్న వ్యాపార ప్రపంచంలో వినూత్న వ్యూహాలు, నాయకత్వ లక్షణాలు, విద్యా-పరిశ్రమల అనుసంధానంపై కీలక చర్చలు జరిపారని ఆయన పేర్కొన్నారు.