ఎరువుల ఆన్‌లైన్ బుకింగ్‌తో రాజన్న సిరిసిల్ల రైతుల అష్టకష్టాలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఎరువుల ఆన్‌లైన్ బుకింగ్ విధానం రైతన్నలకు శాపంగా మారింది. స్మార్ట్ ఫోన్లు వాడడం రాక, సర్వర్ సమస్యలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాప్ ల ద్వారానే ఎరువులంటూ అధికారులు చెబుతుండటంతో రైతులు డిజిటల్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పాత పద్ధతిలోనే ఆఫ్‌లైన్ ద్వారా ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.