అటవీ కార్యాలయంలో బోను బద్దలు కొట్టి సిబ్బందిపై చిరుత దాడి
రిపోర్టర్: వెంకట్
స్థలం: నేపాల్
నేపాల్‌లోని లమ్జుంగ్ జిల్లా అటవీ కార్యాలయంలో రెస్క్యూ చేసిన చిరుతపులి మత్తు వీడి బోను బద్దలు కొట్టింది. సిబ్బందిని చూసి ఒక్కసారిగా విరుచుకుపడి అటవీ శాఖ గార్డుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చివరకు సిబ్బంది కష్టపడి దానిని మళ్లీ బంధించారు.