హైదరాబాద్‌లో మహిళపై దాడి చేసిన హోంగార్డు అరెస్ట్

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని హాఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ బయట మహిళపై దాడి చేసి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటనలో ఆర్పీఎఫ్‌కు డిప్యుటేషన్‌పై వెళ్లిన తెలంగాణ హోంగార్డు ఆనంద్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీపీ సీవీ ఆనంద్, సైబరాబాద్ సీపీ రమేష్ ఆదేశాల మేరకు నిందితుడిని సర్వీసు నుంచి తొలగించి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మహిళలపై హింసను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.