రాష్ట్రద్రోహానికి పాల్పడిన ఎవరూ తప్పించుకోలేరంటూ కేంద్రంపై రాహుల్ గాంధీ నిప్పులు

రిపోర్టర్: సతీష్ స్థలం: New Delhi

భారత దేశానికి వ్యతిరేకంగా అన్యాయం చేసిన ఏ ఒక్కరూ కూడా ఎప్పటికీ తప్పించుకోలేరని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ , ఎన్నికల సంఘం అధికారులు మరియు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్లను ఈ సందర్భంగా ఆయన నేరుగా హెచ్చరించారు. దేశానికి ద్రోహం చేసిన ప్రతి ఒక్కరిపైనా భవిష్యత్తులో చట్టపరమైన విచారణ ఉంటుందని, ఎవరూ తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు.