చంద్రబాబు పాలనపై వైఎస్సార్సీపీ నేత వెల్లాల రామకృష్ణ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Andhra Pradesh
రాష్ట్రంలో కుల, మత, ధన రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని వైఎస్సార్సీపీ నేత వెల్లాల రామకృష్ణ విమర్శించారు. సూపర్-6 హామీలు అమలు చేయకుండా నిస్సిగ్గుగా విజయోత్సవాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో ప్రజలు నీటి సమస్యతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి బీచ్లో మిక్చర్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.