9/11 బాధితురాలి సంచలన వ్యాఖ్యలు, సౌదీ అరేబియాపై తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: వెంకట్
స్థలం: World
అమెరికాలో జరిగిన 9/11 దాడుల 25వ వార్షికోత్సవ వేడుకల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రౌండ్ జీరో వద్ద బాధితురాలు టెర్రీ స్ట్రాడా అమెరికా ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉగ్రదాడికి పాల్పడిన సౌదీ అరేబియాను అమెరికా ప్రభుత్వాలు కాపాడుతున్నాయని ఆమె ధ్వజమెత్తారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ వ్యవహారంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.