యాదాద్రి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలంటూ కలెక్టరేట్ వద్ద రైతుల కన్నెర్ర

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఆలేరు

ఎల్ నినో ప్రభావంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షాలు కురవక పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయ కూలీలకు పనులు లేక, పశువులకు గడ్డి కరువై బతుకుదెరువు గగనమైంది. ఈ నేపథ్యంలో జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని, తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టరేట్ ఎదుట ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నాయకులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించి డిమాండ్ చేశారు.