నర్సీపట్నం మున్సిపాలిటీ అక్రమాలపై నిప్పులు చెరిగిన చింతకాయల అనిత
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
నర్సీపట్నం మున్సిపాలిటీలో గత రెండున్నర సంవత్సరాల కాలంగా నాయకుల ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని చైర్మన్ అభ్యర్థి చింతకాయల అనిత ఆరోపించారు. చిన్న వ్యాపారస్తులను బెదిరించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆమె వాపోయారు. మున్సిపాలిటీలో డ్రైనేజ్ వ్యవస్థ మరియు ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టడం లేదని పేర్కొంటూ రాబోయే రోజుల్లో సమర్థులైన నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.