విజయవాడ కనకదుర్గమ్మకు తొలి పట్టు వస్త్రాలు సమర్పించిన నగర పోలీస్ కమిషనర్ దంపతులు

రిపోర్టర్: నరేష్ స్థలం: ఎన్టీఆర్

దసరా ఉత్సవాల సందర్భంగా ఆనవాయితీ ప్రకారం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మకు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు దంపతులు ఘనంగా మొట్టమొదటి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు ఎన్టీఆర్ పోలీస్ వెల్లడించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే వేలాది మంది భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోందని అధికారులు పేర్కొన్నారు.