పంట కాల్వల పూడికతీత పేరిట నిధుల గోల్మాల్పై నిలదీస్తున్న అన్నదాతలు

రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు స్థలం: కొయ్యూరు

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని శివాలయం సమీపంలో ఉన్న చెక్డ్యాం వద్ద నాలుగు లక్షల రూపాయలతో చేపట్టిన పూడికతీత పనులపై స్థానిక రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రయోజనం లేకుండా కేవలం బిల్లుల కోసం పనులు చేశారని ఆరోపిస్తూ ఇంజినీరింగ్ అధికారుల తీరును రైతులు నిలదీశారు. పనులపై పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.