నెల్లూరు రూరల్లో వైకాపాను వీడి తెదేపాలోకి భారీగా నేతల చేరిక

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నెల్లూరు రూరల్

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నాయకులు రావు శ్రీనివాసులు తమ మిత్రబృందంతో కలిసి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రావు శ్రీనివాసులుకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, కుటుంబసభ్యుడిగా చూసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.