విజయనగరం రాజకీయాల్లో సంచలనం: వైకాపాకు భారీ షాక్ ఇస్తూ తెదేపాలోకి చేరికలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Vizianagaram

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైకాపాకు భారీ ఎదురుదెబ్బ తగిలిందని స్థానిక నాయకులు తెలిపారు. తెదేపా సీనియర్ నేత కళా వెంకట్రావు సమక్షంలో ఏకంగా మూడున్నర వేల మందికి పైగా వైకాపా నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. బొత్స చిన్న శ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ చేరికల కార్యక్రమంతో నియోజకవర్గంలో వైకాపా శ్రేణులు తీవ్ర గందరగోళంలో పడ్డాయని, రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని తెదేపా వర్గాలు స్పష్టం చేశాయి.